తాజా వార్తలు

Saturday, 25 June 2016

‘సైతాన్’ గా విజయ్ ఆంటోని…

విజయ్ ఆంటోని ఇంకా చెప్పాలంటే ‘బిచ్చగాడు’ ఇప్పుడీ పేరు సినీ ప్రియులకు మరింత ప్రియం అవుతోంది. ‘నకిలీ’, ‘డా. సలీమ్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి, ‘బిచ్చగాడు’ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా హవా కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మరో సినిమాతో మనముందుకు రాబోతున్నాడు ఈ మ్యూజిక్ డైరక్టర్ కమ్ హీరో.
ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా తమిళంలో తెరకెక్కిన ‘సైతాన్’ సినిమాను అదే పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులను నిర్మాత ఎస్. వేణుగోపాల్ చేజిక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.., “విజయ్ ఆంటోని ‘సైతాన్’ చిత్రం తెలుగు నాట ప్రదర్శన హక్కులు తమ సంస్థ ‘విన్.విన్.విన్. క్రియేషన్స్ చేజిక్కించుకోవటం పట్ల ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ‘బిచ్చగాడు’ చిత్రం విడుదలకు సిద్ధమైన దశలోనే ‘సైతాన్’ చిత్రం హక్కులను తీసుకునే ప్రయత్నం చేసామని, మా ఈ ప్రయత్నానికి ఎంతో సహకరించిన కృష్ణవంశీ గారికి, విజయ్ ఆంటోనీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు” అని అన్నారు.
ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియోను జూలై నెలలో నిర్వహించనున్నారు. ఇక ఆ తరువాత ఆగష్టులో తెలుగు, తమిళంలో చిత్రం ఒకే సారి చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక “ఇంతవరకు నటించిన సినిమాలలాగే ఈ సినిమా కూడా వైవిధ్యమైనదని, ఈ మూవీతో నటుడిగా తెలుగులో మరింత పేరు సంపాదిస్తానన్న నమ్మకం ఉందని” హీరో విజయ్ ఆంటోని తెలిపారు. ఇందులో విజయ్ సరసన అరుంధతి నాయర్ జంటగా నటిస్తోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment