తాజా వార్తలు

Monday, 20 June 2016

రెండు రాజధానుల మధ్య సూపర్‌ ఫాస్ట్‌ రైలు…

హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రభుత్వ ఉద్యోగుల తరలింపు కోసం కొత్త ట్రైన్ సర్వీసు ఏర్పాటైంది. విజయవాడలో జెండా ఊపి ప్రారంభించారు రేల్వే మంత్రి సురేశ్ ప్రభు, ఏపీ సీఎం చంద్రబాబు. అదే సమయంలో గుంతకల్లు- కల్లూరు డబ్లింగ్‌ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సూపర్ ఫాస్ట్ రైలులో ఐదు ఏసీ బోగీలు, ఎనిమిది స్లీపర్ క్లాస్ బోగీలు ఏర్పాటు చేశారు. వారంలో ఐదు రోజుల పాటు ఈ సర్వీస్ ఉంటుంది. సికింద్రాబాద్‌లో ఉదయం ఐదున్నరకు బయలుదేరే ట్రైన్.. 11గంటలకు విజయవాడ చేరుతుంది. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం తగ్గించేలా బోగీల్లో ఏర్పాట్లు చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment