తాజా వార్తలు

Wednesday, 8 June 2016

పీఏసీని ఆషామాషీగా తీసుకోవద్దు

ప్రజా పద్దుల సమితి(పీఏసీ)ని ఆషామాషీగా తీసుకోవద్దని ప్రభుత్వ అధికారులను పీఏసీ చైర్మన్, సభ్యులు హెచ్చరించారు. బుధవారం సమితి సమావేశం చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో జరిగింది. సమావేశానికి సభ్యులు ఆదిమూలపు సురేష్, పిల్లి సుభాష్ చంద్రబోస్, బత్యాల చెంగల్రాయుడు, పి.విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు.
ఎక్సైజ్, గృహ నిర్మాణ శాఖలపై వాటి అధికారులతో కమిటీ సమీక్షించింది. సభ్యులు లేవనెత్తిన సందేహాలకు సమాధానం ఇచ్చేందుకు అధికారులు కొంత గడువు కావాలని కోరారు. దీనిపై చైర్మన్, సభ్యులు స్పందిస్తూ కమిటీ సమావేశాలను ఆషామాషీగా తీసుకోవద్దని, తాము నిక్కచ్చిగా ఉంటామని చెప్పారు. గురువారం జరిగే సమావేశంలో యువజన సంక్షేమం గురించి కమిటీ సమీక్షించనుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment