తాజా వార్తలు

Thursday, 16 June 2016

అసలు సినిమా ముందుంది

నరేంద్రమోదీ పాలనలో ఈ రెండేళ్లు సినిమా ట్రయల్ మాత్రమే చూశారని, రాబోయే మూడేళ్లలో అభివృద్ధి శరవేగంగా పరుగులు పెడుతుందని, అసలు సినిమా ముందుందని కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పరీకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కేంద్రప్రభుత్వం అంతకంటే ఎక్కువ సహాయం చేస్తుందని పేర్కొన్నారు. మోదీ రెండేళ్ల పాలన గురించి ప్రజలకు వివరించడంకోసం గురువారం నెల్లూరులో నిర్వహించిన మేధావుల సదస్సు, బహిరంగసభల్లో పరీకర్ మాట్లాడారు.
పేదలకు సాయం చేయడంకోసం వంటగ్యాస్ సబ్సిడీ వదులుకోవాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కోటీ 15 లక్షలమంది సబ్సిడీ వదులుకున్నారని తెలిపారు. కర్రలు, బొగ్గు మీద వంటచేస్తూ క్యాన్సర్ బారిన పడుతున్న పేదలకు ఈ డబ్బుతో దేశంలో 5 కోట్ల గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో  కేంద్ర జలవనరులశాఖ సహాయమంత్రి సన్వర్‌లాల్ జాట్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దినేష్‌శర్మ, పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment