తాజా వార్తలు

Friday, 17 June 2016

చంద్ర‌బాబు, కేసీఆర్‌ల మ‌ధ్య జ‌రిగిన చీక‌టి ఒప్పందం ఏంటి?

చంద్ర‌బాబు, కేసీఆర్‌ల మ‌ధ్య జ‌రిగిన చీక‌టి ఒప్పందం ఏంటి?
ఇద్ద‌రు సీఎంలు ఒక్క‌ట‌వ‌డం వెనుక ఉన్న కార‌ణాలేంటి?
నిన్న మొన్న‌టిదాకా కాలుదువ్వుకున్న నేత‌లెందుకు స‌డెన్‌గా ఫ్రెండ్స్ అయ్యారు?
ఇద్ద‌రు చంద్రుల చెలిమి వెనకున్న సీక్రెట్ క‌హానీ ఏంటో తెలుసుకోవాలా?...లెట‌జ్ రీడ్ దిస్‌
ఉప్పు, నిప్పుల్లా పోట్లాడుకున్న చంద్రులిద్ద‌రూ ఒక్క‌టైపోయారు. నాకు నీవు నీకు నేను అన్న‌ట్లుగా మారిపోయారు. ఓటుకు నోటు కేసు ఈ ఇద్ద‌రు చంద్రుల‌ను ఒక్క‌టి చేసింద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. కేసు మొద‌ట్లో ఇద్ద‌రూ క‌త్తులు నూరుకున్నారు. ఒక‌రిపై ఒక‌రు బ‌హిరంగంగా విమ‌ర్శించుకోవ‌డ‌మే కాదు ఏకంగా ఢిల్లీ దాకా ఫిర్యాదులు చేసుకున్నారు. కానీ ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ మొద‌లైంది. ఢిల్లీ చేరిన వ్య‌వ‌హారంలో బీజేపీ పెద్ద‌లు జోక్యం చేసుకోవ‌డం...ఎక్సెట్రా ఎక్సెట్రా...క‌ట్ చేస్తే చంద్ర‌బాబు ఇంటికెళ్ళి చేప‌ల పులుసు తినొచ్చారు మ‌న కేసీఆర్‌...ఇక కేసీఆర్ యాగానికి చంద్ర‌బాబు వ‌చ్చి ప్ర‌సాదాలు స్వీక‌రించారు. ఇద్ద‌రు చంద్రులు స‌ఖ్య‌త‌గా మెల‌గాల‌ని కేంద్ర పెద్ద‌లు చెబితే స‌రిగ్గా అదే పాటిస్తున్నారు తెలుగు రాష్ట్ర సీఎంలు. కానీ ఇందులో ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు మాత్రం గాలికొదిలేశారు. నీటి హ‌క్కుల విష‌యంలో ఏపికి జ‌రుగుతున్న అన్యాయాన్ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించ‌రు. తెలంగాణ అంశాల‌పై చంద్ర‌బాబును కేసీఆర్ అడ‌గ‌డం అస‌లు పూర్తిగా మ‌ర్చిపోయారు. ప‌బ్లిక్ ఇష్యూస్‌ని ప‌క్క‌న‌బెట్టేశారు. నీ విష‌యంలో నేను జోక్యం చేసుకోను...నా విష‌యాల్లో నువ్వు ఇన్‌వాల్వ్ కాకూడ‌ద‌ని ఇద్ద‌రూ కూడ‌బ‌లుక్కున్నారు. ఓట్లేసిన ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌లు గాలికొదిలేశారు. నువ్వు నేను క‌లిసుంటేనే నాకెంతో ఇష్టం అని ఒక‌రు, నువ్వు నేను ఒక‌టైతేనే మ‌న‌కింక తిరుగులేద‌ని మ‌రొక‌రు డ్యూయెట్‌లు పాడుకుంటూ రెండేళ్ళ టైం పూర్తి కానిచ్చారు. ఇక మిగిలింది రెండేళ్ళే...చివ‌రి ఏడాదంతా ఎల‌క్ష‌న్ ఇయ‌ర్‌...అప్పుడు డెవ‌ల‌ప్‌మెంట్ గురించి ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు...ఓన్లీ పాలిటిక్స్‌కే టైం స‌రిపోదాయే. ఈ టూ ఇయ‌ర్స్ కూడా కృష్ణా, రామా అంటూ మాట‌లు చెప్పుకుంటూ బ‌తికేస్తే పోలా...
« PREV
NEXT »

No comments

Post a Comment