తాజా వార్తలు

Wednesday, 22 June 2016

పనికిరాని ప్రాజెక్టులెందుకు?

కొమురవెల్లి మల్లన్న సాగర్‌తో ఎవరికి మేలు జరుగుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలైన మెదక్ జిల్లా తొగుట మండలం వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, కొండపాక మండలం ఎర్రవల్లిలో బాధితులు చేపట్టిన రిలే దీక్షాశిబి రాలను బుధవారం ఆయన సందర్శించి సంఘీభావం ప్రకటించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ  కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో జనం బాధలు తీరుస్తారని కేసీఆర్‌కు ఓట్లేసి గెలిపిస్తే ప్రాజెక్టుల పేరుతో ప్రజలను ముంచుతున్నారని ఆరోపించారు. 

ప్రజల ఆస్తులకు నష్టం కలగకుం డా ఒకటి లేదా రెండు టీఎంసీల సామర్థ్యంతో అక్కడక్కడా ప్రాజెక్టులు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు వద్దంటూ 14 గ్రామాల ప్రజలు కోరుతుంటే వీరికి వ్యతిరేకంగా.. ప్రాజెక్టు కావాలంటూ మెదక్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాలో ఆందోళనలు చేయించడం దారుణమన్నారు.  ఈ సందర్భంగా వేములఘాట్ పాఠశాలలోని పదోతరగతి విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన వినతి పత్రాన్ని లక్ష్మణ్‌కు అందజేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment