తాజా వార్తలు

Thursday, 2 June 2016

ఓఎస్డీ అప్పారావును కొనసాగిస్తా: అశోక్ గజపతి

తన ఓఎస్డీ అప్పారావు ఫోన్ కాల్స్‌ను తనిఖీ చేయాల్సిందిగా సంబంధిత అధికారులను కోరినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు చెప్పారు. అన్యాయంగా ఆయనను ఉరేయమని మాత్రం చెప్పబోనని, ఆయన మీద తనకు నమ్మకం ఉన్నంత వరకు ఓఎస్డీగా కొనసాగిస్తానని తెలిపారు. తాను సంజయ్ భండారీని కలిశానని ఆయన అంగీకరించారు.
ఎయిర్‌షోలో స్టాల్ ప్రారంభానికి తనను పిలిస్తే వెళ్లానని, అక్కడే ఆయనను కలిశానని అన్నారు. అప్పారావుపై అవినీతి ఆరోపణలు ఏంటో తనకు తెలియదని, తాను కూడా పత్రికలలోనే చూశానని అన్నారు. వాద్రా లండన్‌లో ఇల్లు కొనుక్కున్నారని కూడా ఆరోపణలు వచ్చాయని తెలిపారు. అప్పారావును తాను రక్షించడం లేదని తెలిపారు. ఆయన మీద వచ్చినవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, వాటి మీద విచారణ జరిగితే తప్ప నిజానిజాలు ఏంటో తెలియవని అన్నారు. ప్రధాని కార్యాలయం నుంచి గానీ మరెక్కడి నుంచి గానీ తనను ఎవరూ అడగరని కేంద్ర మంత్రి తెలిపారు.

ఆరోపణల నేపథ్యంలో మీడియా ప్రతినిధులను అశోక్ గజపతిరాజు తన కార్యాలయానికి పిలిచి ఈ అంశంపై వివరణ ఇచ్చారు. అయితే ఓఎస్డీ అప్పారావు మాత్రం మీడియాకు ముఖం చాటేశారు. ఫోన్ కాల్స్‌కు కూడా ఆయన స్పందించడం లేదు.
« PREV
NEXT »

No comments

Post a Comment