తాజా వార్తలు

Monday, 6 June 2016

ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు

రంజాన్ మాసపు నెలవంక సోమవారం సాయంత్రం దర్శనమిచ్చింది. దీంతో మంగళవారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. రంజాన్ నెల ఆరంభ సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సామరస్యానికి, సుహృద్భావానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అయిన రంజాన్‌ను ముస్లిం సోదరులు ఉపవాసాలతో నెల రోజులపాటూ జరుపుకుంటారని తెలిపారు.
మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించింది కూడా రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని పేర్కొన్నారు. ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండటం, పేదలకు తోడ్పాటు అందించటం రంజాన్ మానవాళికి ఇచ్చే సందేశమని పేర్కొన్నారు. సొంత లాభం మానుకుని పొరుగువారికి సాయపడాలన్న ఆశయం రంజాన్ పండుగలో అంతర్లీనంగా ఉన్న సందేశం అని తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment