తాజా వార్తలు

Sunday, 26 June 2016

చెన్నైలో వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన

సదావతి సత్రం భూముల స్వాహా ఉదంతంపై వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో నిజనిర్థారణ కమిటీ నేడు చెన్నైలో పర్యటిస్తోంది.  
పాలంబూరులోని సత్రం భూములను కమిటీ సభ్యులు పరిశీలిస్తున్నారు. భూముల వేలం వ్యవహారంపై కమిటీ ఆరా తీస్తోంది. ఇప్పటికే అమరావతిలోని సదావర్తి సత్రాన్ని నేతలు పరిశీలించారు. ఈ భూములను టీడీపీ నేతలు గుట్టుచప్పుడు కాకుండా కారుచౌకగా కొట్టేశారు. మొత్తం 83 ఎకరాల భూమిని టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు స్వాహా చేశారు. బహిరంగ మార్కెట్ ప్రకారం ఎకరా రూ.10 కోట్లు ఉండగా ప్రభుత్వం తమ అనుచరులకు ఎకరాకు రూ.27 లక్షలకే కట్టబెట్టింది. ప్రస్తుతం పాలంబూరులోని సత్రం భూముల్లో నిజనిర్థారణ కమిటీ పర్యటన కొనసాగుతోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment