తాజా వార్తలు

Friday, 3 June 2016

'టీడీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు'

రాష్ట్రంలో ప్రజలు బాధలు పడుతుంటే టీడీపీ నేతలు మాత్రం విదేశీ పర్యటనలు చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారని అన్నారు. రాజధాని భూములను బినామీలకు అమ్ముతున్నారని బొత్స అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, వారి మానసిక స్థితి బాగుందా? లేదా అన్నారు.

రాజ్యసభ ఎన్నికలను కూడా వ్యాపార దృష్టితో చూస్తున్నారని, స్వయంగా టీడీపీ సీనియర్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని అనుకుంటే నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కడుతుంటే టీడీపీ నేతలు మాట్లాడం లేదన్నారు. వారికి వ్యవస్థలపై గౌరవం లేదని బొత్స వ్యాఖ్యానించారు. అన్నారు. ఇక కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు పేషీ నుంచి ఫోన్స్ కాల్స్ పై ఏం బాధ్యత వహించారని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment