తాజా వార్తలు

Monday, 20 June 2016

రైతు సమస్యలపై దృష్టి సారించండి

రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని టీ వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో సోమవారం ఆయన మాట్లాడుతూ...తక్షణమే వడ్డీతో సహా రైతుల రుణమాఫీని అమలు చేయాలన్నారు.

రైతు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కొండా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ హైటెక్ పోకడలు మాని...రైతు సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment