తాజా వార్తలు

Thursday, 9 June 2016

'బాబు తప్పిదాల వల్లే ఏపీ నష్టపోతుంది'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న తప్పిదాల వల్లే ఏపీ నష్టపోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. హైదరాబాద్ పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆమె మాట్లాడుతూ...బాబు రెండేళ్ల పాలనలో సాధించిందేమీ లేదన్నారు.
కడప నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు చేసిన ప్రసంగం ఆయన మానసిక పరిస్థితికి అద్దంపడుతుందని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. తుని రైలు దహనం వెనుక కూడా కడప రౌడీలున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తుకు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా రాయలసీమ గుండాలనడం బాబుకు ఊతపదమైందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కు తాను ఎందుకు భయపడతానని చంద్రబాబు అంటున్నారని....ఆయన చేసిన తప్పుల వల్లే వారికి భయపడుతున్నారని అన్నారు. సీఎం పదవిలో ఉండి అబద్ధాలు, మోసాలు చేయొచ్చా..?? అని చంద్రబాబుని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment