తాజా వార్తలు

Thursday, 9 June 2016

'సీమ ఆత్మగౌరవాన్ని బాబు దెబ్బ తీస్తున్నారు'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయలసీమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు.


కడపలో గురువారం ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజాద్ బాషా, శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ...జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా సీమ రౌడీలంటూ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మితే ప్రాణానికి ప్రాణం ఇచ్చేది కడప వాసులేనని, చంద్రబాబులా ద్రోహులు కాదని మండిపడ్డారు. రాష్ట్ర విభజన కోసం కేంద్రానికి లేఖ ఇచ్చింది మీరు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఇప్పుడు విభజనపై బాబు మాటమార్చి ఇతరులను నిందిస్తున్నారని ఎమ్మెల్యేలు ఆరోపించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment