తాజా వార్తలు

Wednesday, 8 June 2016

'దమ్ముంటే పులివెందులలో చర్చకు సిద్ధమా?'


వైఎస్ఆర్ సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డికి సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు హామీలపై వైఎస్ జగన్ తో చర్చించే స్థాయి సతీష్ రెడ్డికి లేదని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. దమ్ముంటే తనతో పులివెందులలో చర్చకు సిద్ధమా అని అవినాష్ రెడ్డి సవాల్ చేశారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు...రైతులకు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయ్యారని ఆయన అన్నారు.

అంతకు ముందు  చంద్రబాబు నాయుడు మోసాలపై  పులివెందులలో వైఎస్ఆర్ సీపీ నేతలు భారీ ర్యాలీ చేస్తున్నారు. అనంతరం పులివెందుల పీఎస్ లో చంద్రబాబు మోసాలపై ఫిర్యాదు చేశారు. ఈ ర్యాలీలో వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర నేతలు  పాల్గొన్నారు. నేడు చంద్రబాబు మోసాలపై ఏపీలోని అన్ని జిల్లాల్లో ఆయనపై కేసులు నమోదు చేసేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పులివెందులలో ఆ పార్టీ కీలక నేతలు భారీ ర్యాలీ చేపట్టారు.
« PREV
NEXT »

No comments

Post a Comment