తాజా వార్తలు

Tuesday, 14 June 2016

మరో హర్రర్ సినిమాలో జరీనా ఖాన్…

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘1921’ అనే హర్రర్ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జరీనా ఖాన్ నటించనుంది. ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా వెల్లడించారు. ఈ పాత్రకు ఆమె అయితేనే న్యాయం చేయగలదన్న ఉద్దేశ్యంతో జరీనాను కలిశామని, ఇక ఇందులో నటించేందుకు ఆమె ఒప్పుకున్నట్లు ఆయన తెలిపారు.

యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొనే పరిణామాలపై ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమాకు రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment