Writen by
Unknown
21:02
-
0
Comments
‘రెండేళ్ల
క్రితం తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్లోని సచివాలయానికి వెళ్తే
అక్కడ టేబుళ్లు, కుర్చీలు కూడా లేని దుస్థితి. అక్కడ జరిగిన అవమానానికి,
అన్యాయానికి ప్రతిగా పట్టుదలతో 133 రోజుల్లో సచివాలయం నిర్మించుకుంటే
దానికి గర్వపడాల్సింది పోయి కుళ్లుకోవడం ఎందుకు’ అని టీడీపీ జాతీయ ప్రధాన
కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ నేతలను ప్రశ్నించారు. మే నెలాఖరులో తిరుపతి
వేదికగా టీడీపీ నిర్వహించిన మహానాడు భోజన కమిటీ సభ్యుల సన్మాన సభ
శుక్రవారం తిరుపతి సమీపంలోని రామచంద్రాపురంలో జరిగింది. ఫుడ్ కమిటీలో
పనిచేసిన 550 మంది కార్యకర్తలకు లోకేశ్ జ్ఞాపికలు అందజేశారు. అంతకుముందు
ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ‘వైసీపీ అధ్యక్షుడు జగనకు 32
ఎకరాల్లో సొంత భవనం ఉండొచ్చు. కానీ ఆంధ్రుల రాజధానికి 32 వేల ఎకరాల భూమి
కూడా ఉండకూడదా? రాజధానికి భూసమీకరణ చేయడం దొంగబ్బాయి(జగన్)కి కంటగింపుగా
మారింది. ఆ భూములను రాజధాని నిర్మాణానికి వినియోగించకుండా అడ్డంకులు
సృష్టిస్తున్నారు’ అని ఆరోపించారు. విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు నిజంగా
ఆంధ్రులేనా? వీరు ఆంధ్రరాష్ట్రం కోసం పనిచేస్తున్నారో... పక్క
రాష్ట్రాలకోసం పనిచేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాడ్చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును చెప్పుతో కొట్టాలన్న జగన వ్యాఖ్యలపైనా లోకేశ
తీవ్రంగా స్పందించారు. ‘వయసులో పెద్దాయన్ను చెప్పుతో కొట్టమంటావా? అయినా
ఎందుకు కొట్టాలి.. రైతులకు 25వేల కోట్ల రుణ మాఫీ చేసినందుకా? రూ.11 వేల
కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేసినందుకా? అవ్వాతాతలకు ఆసరాగా పింఛను
మొత్తాన్ని ఐదు రెట్లు పెంచినందుకా..? జగన చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
No comments
Post a Comment