తాజా వార్తలు

Monday, 4 July 2016

పదవులు వద్దు.. నిధులు ఇవ్వండి


తమకు మంత్రి పదవులు కంటే నిధులు ముఖ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్లు తెలిసింది. కేంద్ర కేబినెట్‌ విస్తరణలో మిత్రపక్షాలు ఆర్పీఐ, అప్నాదళ్‌లకు చోటు దక్కుతున్నా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి టీడీపీ, జమ్మూ కశ్మీరు నుంచి పీడీపీకి కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కడం లేదు. పీడీపీ నుంచి ఇప్పటికే ముగ్గురు మంత్రివర్గంలో ఉన్న నేపథ్యంలో కశ్మీరు ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా తమకు మంత్రి పదవులు వద్దని చెప్పినట్లు తెలిసింది. అలాగే, చంద్రబాబు కూడా ఇటీవల కలిసినప్పుడు, తమకు ప్యాకేజీ, నిధులు కావాలని, మంత్రి పదవులు వద్దని స్పష్టం చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందుకే, ఈసారి కేంద్ర కేబినెట్‌ విస్తరణలో టీడీపీకి అవకాశం కల్పించలేదని వివరిస్తున్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment