తాజా వార్తలు

Wednesday, 13 July 2016

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సమాధికి స్థలం కష్టాలు

దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం స్మారక మండప నిర్మాణపు పనులు జాప్యం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించకపోవడమే కారణమని కేంద్ర ఆర్కిటెక్‌ ఇంజనీర్లు పేర్కొన్నారు. కలాం గత యేడాది జూలై 27న షిల్లాంగ్‌లో ఓ విద్యార్థుల సదస్సులో ఆకస్మికంగా మృతి చెందారు. రామేశ్వరం సమీపం పేకరంబు ప్రాంతంలో అంత్యక్రియలు జరిగాయి. ఆ ప్రాంతం వద్ద కలాం స్మారక మండపం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతమున్న 1.5 ఎకరాల స్థలం స్మారక మండపం నిర్మాణానికి చాలదని, అదనంగా అనువైన స్థలాన్ని కేటాయించాలని కేంద్ర సైనిక పరిశోధన అభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 27తో కలాం తొలి వర్ధంతి జరుగనున్నప్పటికీ ఆయన స్మారక మండప నిర్మాణపు పనులు మాత్రం ఇంకా చేపట్టలేని పరిస్థితులు దాపురించాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కలాం సమాధి ప్రాంతం వద్ద కేంద్ర ఆర్కిటెక్‌ ఇంజనీర్లు పరిశీలనలు జరిపారు. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ కలాం సమాధి ప్రాంతంలో విశాలమైన స్మారక మండపం నిర్మించాల్సి ఉందని, చిల్డ్రన్స్ పార్కు, ఎగ్జిబిషన్ హాలు సిబ్బందికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. వీటన్నింటినీ ఒకే ప్రాంగణంలో నిర్మించాలంటే ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించిన స్థలం చాలదని ఇంజనీర్లు తెలిపారు. అదనంగా స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభు త్వానికి ఇప్పటికే విజ్ఞపి చేశామని వారు తెలిపారు. స్థలం కేటాయించకపోవడం వల్లే మండపం నిర్మాణపు పనులు జాప్యమవుతున్నాయని ఇంజనీర్లు వివరణ ఇచ్చారు.
« PREV
NEXT »

No comments

Post a Comment