తాజా వార్తలు

Wednesday, 13 July 2016

మద్యం తాగి...మైనర్ బాలుడిపై మహిళ లైంగిక దాడి !

పీకల దాకా మద్యం తాగి... కామంతో కళ్లు మూసుకుపోయిన 26 ఏళ్ల మహిళ 17 ఏళ్ల మైనర్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన వింత సంఘటన న్యూఢిల్లీలో జరిగింది. సౌత్ ఢిల్లీలోని కిషన్‌ఘడ్‌కు చెందిన ఓ బాలుడు ఇటీవల ప్లస్ టూ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. ఈ బాలుడికి నెలరోజుల క్రితం సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా ఓ మహిళ పరిచయమైంది. దీంతో ప్రతిరోజు ఆ మహిళ బాలుడితో ఛాటింగ్ చేసేది. దీంతో ఆ మహిళ ఢిల్లీ మహిపాల్ పూర్ లోని మూడు నక్షత్రాల హోటల్ లో ఓ గది బుక్ చేసి, తనను హోటల్ కు రమ్మని కోరిందని బాధిత బాలుడు పోలీసులకు చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం హోటల్ కు మద్యం బాటిల్ తో వచ్చిన మహిళ తాగి తనతో సెక్స్ చేయాలని ఒత్తిడి చేసిందని బాలుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మహిళతో సెక్స్ చేసేందుకు తాను నిరాకరించానని బాలుడు పోలీసులకు చెప్పాడు. దీంతో బాలుడి ఫిర్యాదుపై సదరు మహిళపై బాలల లైంగిక నేరాల చట్టం (పోస్కో) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసు అధికారులు చెప్పారు. నిందితురాలైన మహిళ పశ్చిమ ఢిల్లీలోని నజాఫ్ గఢ్ ప్రాంతవాసి అని పోలీసులు చెప్పారు. కాగా బాలుడు తనపై అత్యాచార యత్నం చేశాడని మహిళ ఫోన్ ద్వారా తమకు ఫిర్యాదు చేశారని సౌత్ ఢిల్లీ అదనపు డిప్యూటీ పోలీసు కమిషనర్ నుపుర్ ప్రసాద్ చెప్పారు. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని, పూర్తి దర్యాప్తు తర్వాత ఎవరు ఎవరిపై లైంగిక దాడికి పాల్పడ్డారనే విషయం తేలుతుందని ఢిల్లీ పోలీసులంటున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment