తాజా వార్తలు

Saturday, 9 July 2016

పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ‘చిత్రాంగద’…

అంజలి ప్రధాన పాత్రలో పిల్ల జమిందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ సినిమా ‘చిత్రాంగద’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..,”ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని థ్రిల్లర్ కామెడీ జానర్‌లో ఈ చిత్రం రూపొందుతుంది. అంజలి తన కెరీర్‌లో చేయనటువంటి ఓ విభిన్నమైన పాత్రను ఇందులో పోషిస్తుంది. ఇక ఈ మూవీ కోసం అంజలి పాడిన పాట చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. కొన్ని అదృశ్య శక్తుల కారణంగా ఆమె జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది? తనకు ఎదురైన సవాళ్లను అధిగమించే క్రమంలో చిత్రాంగదకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నదే మా చిత్ర ఇతివృత్తం. కథానుగుణంగా ఆమెరికాలోని పలు అందమైన లొకేషన్స్ లో కీలక ఘట్టాల్ని చిత్రీకరించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలో ఆడియోను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

సప్తగిరి, రాజా రవీంద్ర, సిందుతులానీ, రక్ష, దీపక్, సాక్షి గులాటి, జబర్దస్త్ సుదీర్, జ్యోతి తదితరులు నటించిన ఈ సినిమాలకు సెల్వగణేష్ సంగీతాన్ని అందించాడు. గంగ పట్నం శ్రీధర్, రెహమాన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment