తాజా వార్తలు

Friday, 1 July 2016

లస్సీ కోసం గర్భవతినయ్యా

లస్సి కోసం గర్భవతినయ్యానంటున్నారు నటి రెజీనా. ఏమిటీ కాస్త కన్ఫ్యూజ్‌గా మరింత కుతూహలంగా ఉంది కదూ.. నటి రెజీనాకు ప్రస్తుతం తెలుగులో మంచి డిమాండ్ ఉంది. అయితే తను ముందు కోలీవుడ్‌లో పరిచయమై ఆ తరువాతనే టాలీవుడ్‌కు వచ్చారు. తమిళంలో కేడీబిల్లా కిలాడిరంగా చిత్రాలు చేశారు. అయితే గ్లామర్ విషయంలో కాస్త బెట్టుచేయడంతో అమ్మడిని ఇక్కడ పక్కన పెట్టారు.

 ఇప్పుడు తెలుగులో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవడంతో ఇప్పుడు మళ్లీ తమిళంలో అవకాశాలు వరిస్తున్నాయి.ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న నెంజం మరప్పదిల్లై చిత్రంలోనూ, సీవీ.కుమార్ దర్శకత్వం హారర్ చిత్తంలోనూ నటిస్తున్నారు. ఈ భామ తన గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ తనది చిన్నతనం నుంచి కాస్త దుడుకు స్వభావం అన్నారు.

 గత ఏడాది ఒక సారి బెంగళూర్‌లో అర్ధరాత్రి 12 గంటల ప్రాంతలో స్నేహితురాళ్లతో కలిసి వెళుతుండగా తనకు లస్సీ తాగాలనిపించిందన్నారు. అప్పుడే మూస్తున్న ఒక షాప్ వద్దకు వెళ్లి లస్సీ కావాలని అడిగానన్నారు. అందుకు ఆ షాప్ యజమాని చిరాకుగా లస్సీ లేదు ఏమీలేదు వెళ్లు అని అన్నాడని తెలిపారు. వెంటనే తాను గర్భంతో ఉన్నాను.

 నాకు లస్సీ ఇస్తే ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని అన్నానన్నారు. దీంతో తన స్నేహితురాళ్లు షాక్‌కు గురయ్యారన్నారు.ఆ షాప్ అతను ఎక్కడ రెజీనా గర్భవతి అని అందరికీ చెబుతారో అని వారు భయపడ్డారన్నారు. అదృష్టవశాతు అతను ఎవరికీ చెప్పలేదని తెలిపారు. ఇలాంటి తమాషాలు చాలా చేశానని, ఇప్పటికీ చేస్తుంటానని రెజీనా అన్నారు. సాగినమ్మ ఏం చేసినా సాగుతుందన్న సామెతలా ఉంది రెజీనా సంగతి.
 
« PREV
NEXT »

No comments

Post a Comment