తాజా వార్తలు

Friday, 1 July 2016

రాజధానికి రూ.2,500 కోట్లే ఇస్తే ఎలా…!

రాజధాని నిర్మాణానికి కేంద్రం కేవలం రూ.2,500 కోట్లే ఇస్తానంటోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గతంలో గుంటూరు, విజయవాడకు వేయికోట్లు ఇచ్చారని ఇప్పుడు దాన్ని కూడా ఇందులో భాగంగానే చూస్తున్నారన్నారు. అంటే ఇక 15వందల కోట్లే ఇస్తామంటున్నారని చెప్పారు. ఏది ఏమైనా శ్రమ, పట్టుదల, తెలివితేటలతో మంచి రాజధానిని నిర్మిస్తామన్నారు చంద్రబాబు.

కేంద్రం ఇస్తామంటున్న నిధులతో అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ కూడా పూర్తి కాదని చంద్రబాబు అన్నారు. తెలివితేటలు, సాంకేతక సహకారంతో రాజధానిని నిర్మించుకుంటామని ఆయన తెలిపారు. అయినప్పటికీ కేంద్రాన్ని నిధులు అడగడం ఆపమని ఆయన చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment