తాజా వార్తలు

Saturday, 2 July 2016

నెలరోజుల్లో పూర్తి చేయకపోతే చర్యలు తప్పవు…

కృష్ణా పుష్కరాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. పుష్కర పనులు పూర్తి చేయడానికి నెల మాత్రమే సమయం ఉండడంతో…. పనులను వేగవంతం చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు. గడువులోగా పనులు పూర్తికాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా… అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. కృష్ణా పుష్కరాల కోసం ప్రభుత్వం రూ.216.42 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు సీఎం చంద్రబాబు. కృష్ణాపుష్కర పనులు నెలరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment