తాజా వార్తలు

Monday, 4 July 2016

యువతకు స్ఫూర్తి అల్లూరి

బ్రిటిష్‌వారి గుండెల్లో నిద్రపోయి, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం విజయవాడ రామకృష్ణాపురంలోని బుడమేరువంతెన సెంటర్‌లో అల్లూరి సీతారామరాజు 119వ జయంతి వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం తొలుత సీతారామరాజు కాంస్య వి గ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎంతో మంది దేశం కోసం ఎన్నో సేవలు చేసినా శాశ్వత ముద్ర వేసుకున్న వారిలో సీతారామరాజు ఒకరని, ఆయన అరుదైన వ్యక్తి అని చెప్పారు. ఆయన పుట్టిన ప్రదేశం నుంచే సీతారామరాజు జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహిస్తున్నామన్నారు. అక్కడొక మ్యూజియంను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మన్యంలో బ్రిటిష్‌ పాలకులను ఎదిరించారని, గిరిజనుల్లో స్ఫూర్తినింపి వారిలో చైతన్యం తెచ్చారని, దేశభక్తిని పెంపొందించారని చెప్పారు. ప్రజలకు అప్పుడు బ్రిటిష్‌వారు ఇబ్బందులు కలిగిస్తే ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలు విభజన రాజకీయాలు తెచ్చి రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విడగొట్టి మన పొట్ట కొట్టారని ధ్వజమెత్తారు. కట్టుబట్టలతో బయటకు వచ్చినా ఎంతో ధైర్యంతో ముందుకు పోతున్నామని చెప్పారు. ఈ ధైర్యాన్ని అల్లూరి వంటి మహనీయుల నుంచే తీసుకున్నామని, యు వత కూడా ఇదే స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తే అన్ని విధాలుగా విజయం మనదే అవుతుందని చెప్పారు పార్లమెంట్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రభుత్వం తరపున నెలకొల్పుతామని, అనుమతి కూడా మంజూరైందని పేర్కొన్నా రు. అనంతరం ఆయన మొక్కలను పంపిణీ చేశారు. ఈ కా ర్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, నారాయణ, కామినేని శ్రీనివాస్‌, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మేయర్‌ శ్రీధర్‌, డిప్యూటీ మేయర్‌ రమణ, కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
 
 
ధన్యజీవి అల్లూరి: అశోక్‌
దేశమంతా గుర్తుంచుకునేలా స్వాతంత్య్ర పోరాటం చేసిన అల్లూరి ధన్యజీవి అని పౌరవిమానయాన మంత్రి పి.అశోకగజపతిరాజు కొనియాడారు. ఆయన త్యాగాన్ని, విలువలను గౌరవించడమే ఆ మహనీయునికి మనమిచ్చే ఘనమైన నివాళి అన్నారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో అల్లూరి జన్మస్థలమైన పాండ్రంకి గ్రామంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, అల్లూరి ఉత్సవసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అల్లూరి 119వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాచార, సాంస్కృతిక శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. అల్లూరి జన్మస్థలానికి రావడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ.. పాండ్రంకిని టూరిస్టు సర్క్యూట్‌లో పెట్టి.. దేశ, విదేశ పర్యాటకులు ఇక్కడకు వచ్చే విధంగా పర్యాటక శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు.
 

గిరి పుత్రిక కల్యాణ పథకంతో అల్లూరికి నివాళి: రావెల
గిరి పుత్రిక కల్యాణ పథకమే అల్లూరి సీతారామరాజుకు ఇచ్చే ఘనమైన నివాళి అని గిరిజన, సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు. విశాఖలోని పోర్టు కళావాణి స్టేడియంలో అల్లూరి జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పా ల్గొన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ మంత్రి అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి ఎంపీ శ్రీనివాసరావు, జిల్లా పరిషత చైర్‌పర్సన్‌ భవానీ భాస్కర్‌, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు పాల్గొన్నారు. అల్లూరి అనుచరులైన గంటం దొర, గాము దొరల నాలుగో తరం వారసులు జీకే వీధి, నిమ్మలపాలేనికి చెందిన మా మిడి రామచంద్రరావు, కొయ్యూరు మండలం నడింపాలెంకు చెందిన గాము రాజబాబు, గాము గంటయ్య దొర, సన్యాసమ్మలను మంత్రులు సత్కరించారు. !ుఫ్ఞోవిేయఛూ
« PREV
NEXT »

No comments

Post a Comment