తాజా వార్తలు

Saturday, 9 July 2016

‘పరిశ్రమలకు నీటిని అమ్ముకోవాలని చూస్తోంది’

పట్టిసీమ ప్రాజెక్టు నుంచి రాయలసీమకు నీటిని తరలిస్తానని చెబుతున్న టీడీపీ సర్కారు రాజధాని ప్రాంతంలోని పరిశ్రమలకు నీటిని అమ్ముకోవాలని చూస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్ సీసీ నాయకుడు ఆళ్ల నాని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టుకు పెట్టిన రూ.1500 కోట్ల ఖర్చును పోలవరంకు పెట్టివుంటే ప్రాజెక్టు ముందుకెళ్లేదన్నారు.
గోదావరి రైతుల పొట్టకొట్టి అడ్డగోలుగా నీటిని తరలించుకుపోతున్నారని విమర్శించారు. వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి పుట్టిన పార్టీ వైఎస్సార్ సీపీ అని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని ఆళ్ల నాని అన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment