తాజా వార్తలు

Friday, 8 July 2016

ఏపీలో పల్స్ సర్వేను ప్రారంభించిన సీఎం…

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రజాసాధికార సర్వేలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, తన తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ వివరాలను అధికారులు సేకరించారు. ఈ రోజు చంద్రబాబు క్యాంపు ఆఫీసుకు చేరుకున్న అధికారులు మొదట ముఖ్యమంత్రి వివరాలను సేకరించారు. అనంతరం లోకేష్‌ను అడిగి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సర్వేకు గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ డండె, కృష్ణా కలెక్టర్ ఎ. బాబు , సీఎం జాయింట్ సెక్రటరీ పీ.ఎస్ ప్రద్యుమ్న, ప్రభుత్వ ఐటీ సలహాదారు జె. సత్యనారాయణ మరియు సమాచార కమిషనర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

ఏపీలో ప్రజాసాధికారిక సర్వే ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు ఇంటి నుంచి సర్వే ద్వారా ఆధార్‌లో అదనపు వివరాల నమోదు, కొత్త సభ్యుల చేరిక, తప్పుల సవరణకు అవకాశం, జిప్పర్‌ కోడ్‌ పేరిట ప్రతి ఇంటికీ డిజిటల్‌ నెంబర్లు, ఆన్‌లైన్‌ ద్వారా ఇంటి చిరునామాను తెలుసుకునే ఏర్పాట్లు… సర్వే కోసం 30వేల మంది సిబ్బందితో, 6 వారాలపాటు కొనసాగనున్న సర్వే… ఆధార్‌, కుల, ఆదాయం వంటి వివరాల సేకరణ, ఆధార్‌లేని వారి వేలిముద్రల సేకరణ, బ్యాంకు ఖాతాలు లేని వారికి అప్పటికప్పుడే కొత్త ఖాతా, తొలి విడత సర్వే శుక్రవారం నుంచి ఈ నెల 31వరకు… రెండో విడత సర్వే ఆగస్టు 6 నుంచి 14 వరకు… ప్రతీ గ్రామానికి కనీసం 25 మంది ఎన్యూమరేటర్లు.
« PREV
NEXT »

No comments

Post a Comment