తాజా వార్తలు

Saturday, 2 July 2016

త్వరలో కష్ణా-పెన్నా నదుల అనుసంధానం

పట్టిసీమ నీటిని ఈనెల 6న విడుదల చేస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు తెలిపారు. నదులను అనుసంధానం చేసిన ఘనత టీడీపీదేనన్నారు చంద్రబాబు. నదుల అనుసందానంతో కరువును పారదోలుతామన్నారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కోటి ఎకరాల్లో బిందు, తుంపర సేద్యం చేయాలని నిర్ణయించామని, రోజుకు లక్ష ఎకరాలకు రెయిన్‌గన్‌ ద్వారా నీరందిస్తామని చెప్పారు ఏపీ సీఎం.

నీటి సంరక్షణకు ఏపీ చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫ‌లితాలనిస్తున్నాయ‌ని తెలిపారు సీఎం చంద్రబాబు. ప్రతీ గ్రామంలో వంద పంట‌కుంట‌లు తవ్వాలని పిలుపునిచ్చారు సీఎం. గోదావ‌రి నీరు వృథాగా సముద్రంలోకి వెళుతోందని, నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయ‌త్నం చేస్తున్నామ‌ని తెలిపారు చంద్రబాబు.

త్వర‌లో కృష్ణా-పెన్నా న‌దుల‌ను అనుసంధానిస్తామ‌ని తెలిపారు చంద్రబాబు. 50 ల‌క్షల ఎక‌రాల‌కు బిందు సేద్యం ద్వారా నీరు అందిస్తామ‌న్నారు. విద్యుత్ స‌బ్సిడీకి రూ.5,500 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నట్లు ఆయ‌న పేర్కొన్నారు. పంపుల వినియోగం తగ్గితే మరింత పవర్‌ ఆదా అవుతుందన్నారు. ఇష్టానుసారంగా బోర్లు వేస్తే కఠిన చర్యలు తప్పవని… అవసరమైతే వాల్టా చట్టాన్ని ప్రయోగిస్తాం చంద్రబాబు హెచ్చరించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment