తాజా వార్తలు

Sunday, 24 July 2016

ఆ జీవోను ఉపసంహరించాలి


బందరు పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ఏకపక్షంగా జారీచేసిన భూ సమీకరణ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర  కార్యదర్శి పి.మధు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పోర్టుపేరుతో సుమారు లక్ష ఎకరాల భూమిని బలవంతంగా తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1800 ఎకరాల భూమి సరిపోతుందని చెప్పిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత లక్ష ఎకరాలు తీసుకోవడానికి ప్రయత్నించడం ప్రజలను మోసగించడమేనన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment