తాజా వార్తలు

Friday, 15 July 2016

సూర‌త్‌ జైలు నుంచి హార్దిక్‌ విడుదల

తొమ్మిది నెలల జైలు జీవితం తర్వాత గుజరాత్‌ పటేళ్ల ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ విడుదలయ్యారు. పటేళ్ల ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం… గత ఏడాది ఆగస్టులో జరిగిన ఆందోళనలో హింస చోటు చేసుకోవడంతో హార్దిక్‌ను దేశద్రోహం కేసు కింద అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.
ప‌టేల్ కుల‌స్తుల‌కు ఉద్యోగాల్లో కోటా క‌ల్పించాల‌ని గుజ‌రాత్‌లో హార్దిక్ పటేల్ ఉద్యమం కొన‌సాగించాడు. ఈ సందర్భంగా జరిగిన ఆందోళనల్లో అహ్మాదాబాద్‌, సూర‌త్ న‌గ‌రాల్లో హార్దిక్ ప‌టేల్‌పై రెండు కేసుల‌ను న‌మోదు చేశారు. గుజరాత్‌ హైకోర్టు హార్దిక్‌ పటేల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో సూర‌త్‌లోని ల‌జ్‌పోర్ కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు హార్దిక్‌ పటేల్‌.
« PREV
NEXT »

No comments

Post a Comment