తాజా వార్తలు

Tuesday, 12 July 2016

‘హైపర్’గా ఎనర్జిటిక్ హీరో రామ్..

‘నేను శైలజ’తో ఫాం లోకి వచ్చిన ఎనర్జిటిక్ హీరో రామ్ కాస్త జాగ్రత్తగా కథలను ఎంచుకుంటున్నాడు. ఈ నేపధ్యంలో ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పుడు ‘హైపర్’ అనే టైటిల్‌ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు నిర్మాతలు.
ఈ టైటిల్‌ పై రామ్‌తో పాటు ఆయన అభిమానులు సంబరపడిపోతున్నారు. రామ్ ఎనర్జిటీకి తగ్గట్లుగా ఈ టైటిల్ బాగా సరిపోతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రామ్ సరసన రాశిఖన్నా నటిస్తోంది. 14 రీల్స్‌ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు..
« PREV
NEXT »

No comments

Post a Comment