తాజా వార్తలు

Sunday, 3 July 2016

'బాబు ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారు'

ముఖ్యమంత్రి చంద్రబాబు చేయిస్తున్న పనులు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన తన స్వగృహంలో మాట్లాడుతూ విజయవాడలో గుళ్లు, గోపురాలు కూల్చివేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు.
పుష్కరాల సమయంలో చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టిందని.. ఈ క్రమంలో ఒక్కసారిగా భక్తుల తోపులాట జరిగి 20 మందికి పైగానే చనిపోయారన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైఎస్‌ఆర్ సీపీ ఇచ్చిన పిటిషన్‌ను స్పీకర్ తిరస్కరించడం వారి నిరంకుశత్వానికి పరాకాష్టగా నిలిచిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నెంబర్-1 స్థానాన్ని ఆక్రమించిందంటే ఈ ఘనత చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్‌కు దక్కుతుందన్నారు. చంద్రబాబు ఇంత అవినీతికి పాల్పడుతున్నా.. అధికార పార్టీ మంత్రులు మాత్రం ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు అవినీతిని ప్రజలు అంతం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment