తాజా వార్తలు

Friday, 15 July 2016

మిమ్మల్ని బాధపెట్టినందుకు సారీ

ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘జనతా గ్యారేజ్’ నుండి ఈ రోజు షాకింగ్‌ న్యూస్ వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తానే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ స్పందించాడు డైరక్టర్ కొరటాల శివ. “బెస్ట్ అవుట్‌ పుట్‌ కోసమే సినిమాను వాయిదా వేశామని, ఈ విషయం ఫ్యాన్స్ ను బాధపెట్టే విషయమే, అందుకే వారికి నా తరపున క్షమాపణ కోరుతున్నా” అని చెప్పాడు కొరటాల.
“సినిమా చాలా బాగా వచ్చిందని, అయితే వర్షాల వల్ల అనుకున్న డేట్స్ కొన్ని డిస్టర్బ్ అయ్యాయని, అందులో పెద్ద కాస్టింగ్ కారణంగా అందరూ తమ డేట్లను వెంటనే అడ్జెస్ట్ చేయలేకపోయారని తెలిపారు. ఇంకా పది రోజుల షూటింగ్ చేయాల్సి ఉందని, ఒకవేళ దాన్ని కంప్లీట్ చేసినా, పోస్ట్ ప్రొడక్షన్ కోసం మిగిలిన వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకు దేవీ శ్రీ, తిరు లాంటి పెద్ద పెద్ద సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారని, ఆగస్ట్ 12నే రిలీజ్ చేయాలనుకున్నప్పటి నుండి ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారని.., అందునా తెలుగు, మలయాళం రెండు భాషలలో తెరకెక్కిస్తున్నాం కాబట్టి సాంకేతిక వర్గానికి టైం ఇవ్వకపోతే సినిమా మీద పెద్ద ఎఫెక్ట్ పడుతుందని” చెప్పారు.
అంతేకాకుండా “ఒకవేళ ఇప్పుడు వారి మీద ఒత్తిడి పెట్టినా కానీ, సినిమా విడుదల దగ్గరపడే సమయానికి రెడీ కాకపోతే అప్పుటికప్పుడు లాస్ట్ మినిట్ అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదనే ఇప్పుడు ఇలా చెప్పాల్సి వస్తుందని చాలా క్లారిటీగా చెప్పాడు కొరటాల. అంతేకాకుండా సినిమా రిలీజైన తరువాత అది బాగలేదు, ఇది బాగలేదు అనే కంప్లైంట్ రాకూడదనే తమ ఉద్దేశమని తెలిపాడు. ఇక ఆడియో గురించి నెక్ట్స్ వీక్‌లో అనౌన్స్ చేస్తామని” చెప్పి అందరూ సంతృప్తి పొందేలా వాయిదాకు గల కారణాలను వివరించాడు కొరటాల.
« PREV
NEXT »

No comments

Post a Comment