తాజా వార్తలు

Friday, 1 July 2016

చంద్రబాబు సార్ అంటూ కేటీఆర్ ట్వీట్..

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ట్విట్టర్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అభినందిస్తూనే.. చిన్నపాటి పోలిటికల్ కౌంటర్ ఇచ్చారు. 

 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా తమ ప్రభుత్వం ఈరోజు నుంచి పరిపాలన ప్రారంభించడంతో సంతోషంగా ఉందని, ఇది ఏపీ చరిత్రలో కొత్త అధ్యాయం అని రెండురోజుల కిందట చంద్రబాబు చేసిన ట్వీట్‌ను కేటీఆర్‌ రీట్వీట్ చేస్తూ.. ‘అభినందనలు సర్‌. సత్వర న్యాయం అందించేందుకు ఏపీ హైకోర్టు అమరావతిలో ఉండాల్సిన అవసరం లేదా’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు విభజన కోసం తెలంగాణలో న్యాయవాదులు, న్యాయాధికారులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు విభజన విషయంలోనూ చంద్రబాబు త్వరగా స్పందించి.. అమరావతికి తరలించాలన్న రీతిలో మంత్రి కేటీఆర్‌  ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేశారు.

« PREV
NEXT »

No comments

Post a Comment