తాజా వార్తలు

Thursday, 21 July 2016

కుట్రలు మాని కలసిరా: రఘువీరా

ఏపీకీ ప్రత్యేక హోదా కోరుతూ శుక్రవారం రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లు విషయంలో ఎలాంటి కుట్రలు చేయకుండా ఓటింగ్‌కు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కోరారు.ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బిల్లు శుక్రవారం ఓటింగ్‌కు రాకుండా చేయడానికి చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు వైఎస్సార్‌సీపీకి రఘువీరా కృతజ్ఞతలు తెలిపారు.

సీపీఐ మద్దతు..: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెచ్చిన బిల్లుకు సీపీఐ మద్దతు పలుకుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు.
« PREV
NEXT »

No comments

Post a Comment