తాజా వార్తలు

Sunday, 24 July 2016

విడాకులేనా?

రెండేళ్లయ్యిందో, లేదో అప్పుడే నటి అమలా పాల్‌ వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడింది. 2014 జూన 12న తమిళ దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ను ఆమె పెళ్లాడిన విషయం తెలిసిందే. పొరపొచ్చాల కారణంగా ఆ ఇద్దరూ విడాకులకు సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం నడుస్తోంది. ఈ ప్రచారంపై వాళ్లిద్దరూ పెదవి విప్పకపోయినా వాళ్ల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని మాత్రం తెలుస్తోంది. ఇంత త్వరగా వాళ్లు విడిపోనున్నారనే విషయం సినీ వర్గాల్ని విస్మయానికి గురిచేసింది. ‘‘భిన్నమైన తమ జీవన శైలుల కారణంగానూ, పొరపొచ్చాల కారణంగానూ పరస్పర అవగాహనతో ఆ ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అతి త్వరలో తమ విడాకుల గురించి వారు ప్రకటన చేసే అవకాశముంది’’ అని సినీ వర్గాలు తెలిపాయి. విక్రమ్‌ కథానాయకుడిగా నటించిన ‘దైవ తిరుమగల్‌’ (తెలుగులో ‘నాన్న’) చిత్రానికి పనిచేసేప్పుడు అమల, విజయ్‌ మధ్య పరిచయం ప్రేమగా మారి పరిణయానికి దారితీసింది. వివాహానంతరం కూడా అమల నటనను కొనసాగిస్తోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment