తాజా వార్తలు

Friday, 1 July 2016

సైమా విజేతలు..

సౌత్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఒకే వేదికగా జరుపుకునే ‘సైమా అవార్డ్స్ 2015-16’ వేడుక సింగపూర్‌లో అట్టహాసంగా జరుగుతోంది. గురువారం ప్రారంభమైన ఈ వేడుకకు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు   మెగాస్టార్ చిరంజీవి, రాజేంద్రప్రసాద్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, అల్లు శిరీష్, అఖిల్, సాయికుమార్,   రానా, వరుణ్ తేజ్,  సుశాంత్, అలీ, రాధిక, సుహాసిని, హన్సిక, నిత్యామీనన్, శృతిహాసన్, కుష్బు, లక్షీ మంచు,  నయనతార, ప్రణిత, సాయేషా సైగల్‌తో పాటు ప్రముఖ గాయని పి.సుశీల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో పురస్కారాల ప్రదానోత్సవంతో పాటు, హీరోయిన్ల పర్‌ఫార్మెన్స్‌లతో ఆడియెన్స్‌ను అలరించారు. సైమా అవార్డ్స్ వేడుకలో తమిళ సంగీత దర్శకుడు అనిరుథ్ రవిచంద్రన్, రకుల్ ప్రీత్ సింగ్, సుధీర్ బాబు, హ్యుమా ఖురేషీ, ఉషా ఉతప్, తదితరులు స్టేజ్ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. టాలీవుడ్ నుంచి అవార్డులు గెలుచుకున్న వారి జాబితాను ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా బాహుబలికి అవార్డ్ దక్కగా, ఉత్తమ నటుడిగా మహేష్ బాబు ఎంపికయ్యాడు. గురువారం జరిగిన వేడుకలో తెలుగు, కన్నడ భాషలకు చెందిన నటీనటులకు అవార్డులను ప్రదానం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఆయా విభాగాల్లో అవార్డులు గెలుచుకున్న వారి జాబితా....
ఉత్తమ చిత్రం : బాహుబలి
ఉత్తమ నటుడు : మహేశ్ బాబు ( శ్రీమంతుడు)
ఉత్తమ నటి : శృతిహాసన్ ( శ్రీమంతుడు)
ఉత్తమ దర్శకుడు : ఎస్.ఎస్.రాజమౌళి (బాహుబలి)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : అల్లు అర్జున్ (రుద్రమదేవి)
ఉత్తమ నటి (క్రిటిక్స్) : అనుష్కశెట్టి ( రుద్రమదేవి)
ఉత్తమ సహాయ నటుడు : రాజేంద్ర ప్రసాద్ ( శ్రీమంతుడు)
ఉత్తమ సహాయనటి : రమ్యకృష్ణ (బాహుబలి)
ఉత్తమ హాస్యనటుడు : వెన్నెల కిశోర్ (భలే భలే మగాడివోయ్)
ఉత్తమ ప్రతినాయకుడు : రానా దగ్గుబాటి (బాహుబలి)
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవిశ్రీ ప్రసాద్ ( శ్రీమంతుడు)
ఉత్తమ గీత రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి (కంచె)
ఉత్తమ నేపథ్య గాయకుడు : సాగర్ (జతకలిసే.. శ్రీమంతుడు)
ఉత్తమ నేపథ్య గాయని : సత్య యామిని ( మమతల తల్లి.. బాహుబలి)
ఉత్తమ కొరియోగ్రాఫర్ : జాని మాస్టర్ ( టెంపర్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : సెంథిల్ కుమార్ ( బాహుబలి)
ఉత్తమ నటుడు (తొలి పరిచయం) : అఖిల్ (అఖిల్)
ఉత్తమ నటి (తొలి పరిచయం) : ప్రగ్యా జైశ్వాల్ ( కంచె)
ఉత్తమ దర్శకుడు (తొలి పరిచయం) : అనిల్ రావిపూడి (పటాస్)
ఉత్తమ నిర్మాత (తొలి పరిచయం) : విజయ్ రెడ్డి, శశిదేవ్‌రెడ్డి (భలే భలే మగాడివోయ్)
2015లో బాగా ప్రసారమైన పాట : రామ రామ (శ్రీమంతుడు)
యూత్ ఐకాన్ ఆఫ్ సౌత్ ఇండియా : సమంత
సౌత్ సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ : సుధీర్ బాబు
జీవిత సాఫల్య పురస్కారం : ఎస్.జానకి


« PREV
NEXT »

No comments

Post a Comment