తాజా వార్తలు

Friday, 1 July 2016

నిద్రపట్టని కిమ్‌ జోంగ్‌...అమాంతం 40 కిలోల బరువు..!

ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ కొద్దికాలంగా నిద్రకు దూరమయ్యారు. ఇది ఊబకాయానికి దారితీస్తోంది. ఫలితంగా ఆయన విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు. గత నాలుగేళ్లలో ఆయన 40 కిలోల బరువు పెరిగినట్టు ఉత్తర కొరియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేర్కొంది. 2012లో అధికారం చేపట్టినప్పుడు కిమ్‌ జోంగ్ 90 కిలోలు ఉండగా, 2014లో 120 కిలోలు, ప్రస్తుతం 130 కిలోలు ఉన్నారు. కిమ్ తన భద్రత గురించిన మనో వ్యాధితో బాధపుడుతున్నాడని, దీంతో తిండి, తాగుడు బాగా ఎక్కువైనట్టు పార్లమెంటరీ కమిటీ ఆ దేశ ఇంటెలిజెన్స్ సర్వీసు ఇచ్చిన రహస్య నివేదిక చెబుతోంది. ఆయన చిన్ననాటి సంఘటనలపై ఓవర్‌సీస్ మీడియా చేస్తున్న ప్రచారం కూడా కిమ్ ఆందోళనకు కారణవుతున్నాయట. దీనికితోడు చైన్‌స్మోకింగ్‌కూ బాగా అలవాటు పడిపోయారట. ప్లాంట్లు, నిర్మాణ స్థలాలు, వ్యవసాయ క్షేత్రాలు సహా ఆయన ఎక్కడ కనిపించినా చేతిలో సిగరెట్‌తోనే కనిపిస్తున్నారట. కిమ్ తండ్రి కిమ్ జోంగ్-ఇల్, తాత కిక్ ఇల్ సుంగ్‌లు కూడా ఊభకాయులే. చైన్ స్మోకర్లు కూడా. ఆ ఇద్దరూ గుంటెపోటుతోనే చనిపోయారని నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ తెలిపింది.
« PREV
NEXT »

No comments

Post a Comment