తాజా వార్తలు

Friday, 15 July 2016

ద్రవిడ్‌కూ అలాంటి స్టోరీ ఉందట!!

క్రికెట్‌ను జంటిల్మన్ గేమ్ అని అంటారు. క్రికెటే కాదు.. అది ఆడే తాను కూడా జంటిల్మన్‌నే అని నిరూపించాడు టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్. క్రికెట్‌లో, బయట తన ప్రవర్తనతో ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఈ క్రికెటర్ ఇంట తాజాగా జరిగిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తనతోపాటు ఉండేందుకు హైదరాబాద్ నుంచి తన ఇంటికి వచ్చిన ఓ అమ్మాయితో జరిగిన సంభాషణను రాహుల్ చాలా ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు.
 
ఇటీవల టీమిండియా మాజీ ‘వాల్’కు క్రికెట్ హ్యూమరిస్ట్ విక్రం సతాయేకు మధ్య ఓ షోలో చిన్న చిట్‌చాట్ జరిగింది. ‘‘ప్రతీ తల్లీ నీలాంటి అల్లుడు కావాలని కోరుకుంటుంది. మీరు గొప్ప భర్త కూడా. మీకు చాలా ఫిమేల్ ఫాలోయింగ్ ఉందని మీ సహచరులు చెప్పారు. మీకేమైనా అటువంటి ఇంట్రస్టింగ్ స్టోరీలేమైనా ఉన్నాయా?’’ అని విక్రం ప్రశ్నించారు.
 
ఆయన ప్రశ్నకు స్పందించిన రాహుల్ ఓ ఆసక్తికరమైన కథను చెప్పుకొచ్చాడు. ‘‘సుదీర్ఘ టూర్ తర్వాత ఇంటికొచ్చా. వచ్చీ రావడంతోనే నిద్రపోయా. సాయంత్రం నిద్రలేచా. ‘‘నీ అభిమాని అట. బయట వెయిట్ చేస్తోంది’’ అని అమ్మ చెప్పింది. హైదరాబాద్ నుంచి ఆమె వచ్చిందట. దాదాపు గంట నుంచి నా కోసం ఎదురుచూస్తోంది. ఆమెకు కాఫీ, టీలు ఇచ్చారు. నేను వెళ్లి ఆమెను కలిశా. ఆటోగ్రాఫ్, ఫొటోగ్రాఫ్ ఇచ్చా. ‘హలో.. బాగున్నారా?’ అని పలకరించా. మీరు హైదరాబాద్ నుంచి వచ్చారట. ఇది చాలా గొప్ప విషయం అని అన్నా’’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు. అయితే ఆ తర్వాత ఆమె చెప్పింది విని తాను షాక్ తిన్నానని రాహుల్ అన్నాడు.
 
ఆమెకు ఆటోగ్రాఫ్ ఇవ్వడంతోపాటు తనతో ఫొటో తీసుకునేందుకు ద్రవిడ్ అంగీకరించాడు. అయితే అనంతరం ఆమె నోటివెంట నుంచి వచ్చిన విషయం విని ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ‘‘మీతో కలిసి ఉండేందుకు నేను హైదరాబాద్‌లోని తండ్రిదండ్రులను వదిలేసి వచ్చేశా. మీ ఇంట్లో నాకా అవకాశం ఇవ్వండి’’ అని ఆమె వేడుకుంది. అంతే.. ఆమె చెప్పింది విన్న మాజీ ‘మిస్టర్ డిపెండబుల్’ నిశ్చేష్టుడయ్యాడు. తర్వాత తేరుకుని ‘‘అదెలా సాధ్యం, మీ తల్లిదండ్రులు ఎక్కడ? అని ప్రశ్నించాడట. తన జీవితంలో ఎదురైన ఒకానొక వింత అనుభవం ఇదేనని రాహుల్ పూసగుచ్చినట్టు వివరించాడు.
« PREV
NEXT »

No comments

Post a Comment