తాజా వార్తలు

Monday, 4 July 2016

విమానాశ్రయంలో రూ.2 కోట్ల మాదక ద్రవ్యాల స్వాధీనం

విమానాశ్రయం నుంచి మలేషియాకు అక్రమంగా తరలిస్తున్న మాదకద్రవ్యాలను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో అందిన రహస్య సమాచారం మేరకు కస్టమ్స్‌ అధికారులు చెన్నై నుంచి మలేషియా వెళ్లే విమానాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో చెన్నైకి చెందిన షాజహాన అనే వ్యక్తి సూట్‌కేస్‌లో వున్న అప్పడాల ప్యాకెట్లలో 2 కిలోల కెటామిన్ పదార్థం వున్నట్టు వెల్లడైంది. దీంతో ఆ మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు షాజహాన్‌‌‌‌ను విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన కెటామిన్ విలువ రూ.2 కోట్లు వుటుందని అధికారులు తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment