తాజా వార్తలు

Friday, 1 July 2016

ఆ ముఖ్యమంత్రి పర్యటన ఖర్చులు చైనా భరించింది

భారత్‌కు చెందిన ఓ ముఖ్యమంత్రి పర్యటన ఖర్చులను చైనా భరించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర పభుత్వం శుక్రవారం ధృవీకరించింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ జూన్ నెలలో చైనాలో పర్యటించారు. ఇటీవల తిరిగి వచ్చిన ఆయన ఆ రాష్ట్రమంత్రి వర్గ విస్తరణ తర్వాత శుక్రవారం తొలిసారి కేబినేట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైనా టూర్ వివరాలను మంత్రులకు తెలిపారు.
 
సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చైనా పర్యటన ఖర్చులు ఆ దేశమే భరించిందని ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆహ్వానం మేరకు ఆయన అక్కడకు వెళ్ళారని అధికార ప్రతినిధి నరోత్తం మిశ్రా తెలిపారు. పెట్టుబడుల ఆహ్వానం కోసం వెళ్ళిన టూర్ కాదన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రవేశపెట్టిన రూపాయికి కిలో బియ్యం, గోధుమలు, ఉప్పు పథకాన్ని చైనా పొలిట్‌బ్యూరో సభ్యులు, ప్రభుత్వ అధికారులు ప్రసంశించినట్లు ఆయన వివరించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment