తాజా వార్తలు

Sunday, 3 July 2016

బాబు బంగారం కొత్త కథే..!

భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి హిట్ కొట్టిన దర్శకుడు మారుతి, తొలిసారిగా ఓ స్టార్ హీరోను డైరెక్ట్ చేస్తూ తెరకెక్కించిన సినిమా బాబు బంగారం. వెంకటేష్ నయనతార జంటగా తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్ టైనర్ ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. వీలైనంత త్వరగా బ్యాలెన్స్ షూటింగ్ ను పూర్తి చేసి ఈ నెల 29న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
గతంలో వెంకటేష్, నయనతారల కాంబినేషన్ లో మారుతి దర్శకత్వంలో రాధ అనే సినిమా ప్రారంభమై.. ఆగిపోయింది. అయితే అదే కథను కొద్ది పాటి మార్పులతో బాబు బంగారంగా తెరకెక్కిస్తున్నారన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపించింది. ఈ వార్తలను ఖండించిన మారుతి, రాధ కథతో బాబు బంగారానికి అసలు సంబందం లేదని, ఇది పూర్తిగా కొత్త కథ అని క్లారిటీ ఇచ్చాడు.
« PREV
NEXT »

No comments

Post a Comment