తాజా వార్తలు

Saturday, 2 July 2016

చైతు వెడ్స్‌ సమంత!

సస్పెన్స్‌ వీడింది! నాగచైతన్య, సమంత పెళ్లిపీటలెక్కనున్నారు!! వచ్చే డిసెంబరులోనే అక్కినేని వారింట పెళ్లిబాజాలు మోగనున్నాయి. ఒక్క పెళ్లి కాదు.. అక్కినేని నాగార్జున తనయులు ఇద్దరూ ఆ నెలలోనే పెళ్లికొడుకులు కానున్నారు. నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, సమంత.. రెండో కుమారుడు అఖిల్‌, ఆయన
చిరకాల స్నేహితురాలు డిజైనర్‌ శ్రియా భూపాల్‌ జోడీలకు పెళ్లి కానుంది. నాగచైతన్య, చెన్నైకి చెందిన సమంత 2010లో వచ్చిన ‘ఏ మాయ చేసావె’ చిత్రంలో కలిసి నటించారు. ఆ సినిమా సూపర్‌హిట్‌ కావడంతో ‘ఆటోనగర్‌ సూర్య’, ‘మనం’ చిత్రాల్లోనూ కలిసి నటించారు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. దీనిపై మీడియాలో, సోషల్‌ మీడియాలో చాలా వార్తలే వచ్చాయి. ఇద్దరూ కలిసి ఒక థియేటర్‌లో సినిమా చూశారంటూ నెట్‌లో ఫొటోలు కూడా హల్‌చల్‌ చేశాయి. అయితే, ఆ వార్తలపై ఇద్దరూ నోరు విప్పలేదు. మెడలో ‘ఎన్‌’ అనే అక్షరం ఉన్న లాకెట్‌ ధరించిన సమంత ఫొటోలు కూడా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఆ అక్షరం తన జీవితంలో ఎంతో ముఖ్యమైందని సమంత చెప్పడం గమనార్హం. మొత్తమ్మీద.. అక్కినేని అందగాళ్లు ఇద్దరూ తాము ఇష్టపడిన అమ్మాయిలను పెద్దల అంగీకారంతోనే మనువాడబోతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment