తాజా వార్తలు

Sunday, 3 July 2016

టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ రజాకార్ల సంఘం

టీఆర్‌ఎస్ అంటే.. తెలంగాణ రజాకార్ల సంఘం అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ తీరు వల్ల రాష్ట్రంలో ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిండా అవినీతిలో కూరుకుపోయిందని, దీనిని ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.

సీఎం కేసీఆర్ అవినీతి కార్యకలాపాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తే.. ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నానంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న కేసీఆర్‌కు చెందిన పత్రిక, టీవీ చానల్‌పై పరువునష్టం దావా వేస్తానన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment