తాజా వార్తలు

Friday, 15 July 2016

బుర్హాన్‌ హత్యకు నిరసనగా పాక్‌లో బ్లాక్‌ డే…

పాకిస్తాన్‌… ఎప్పటికీ పాపి(కి)స్తానే… కాలం మారుతున్నా దాని బుద్ధి మాత్రం మారదు. జమ్మూ కాశ్మీర్‌ అల్లర్లపై ఈ నెల 19న బ్లాక్‌ డేగా ప్రకటించడంతో… నా దుర్బుద్ధి ఎప్పటికీ మారదని మరోసారి నిరూపించుకుంది పాక్‌. ఉగ్రవాది బుర్హాన్‌ను కాశ్మీరీ నేతగా అభివర్ణించుకుని చాలా గొప్పపనిచేశాననుకుంటుంది పాకిస్తాన్‌.
కాశ్మీర్‌ వ్యవహారంలో భారత్‌ను మరింత రెచ్చగొట్టే చర్యలు చేపడుతోంది పాక్‌. ఉగ్రవాది బుర్హాన్‌ను కాశ్మీరీ నేతగా పేర్కొన్న పాక్‌… బుర్హాన్‌ హత్యకు నిరసనగా ఈ నెల 19న బ్లాక్ డేగా ప్రక‌టించింది. ఈ విష‌యాన్ని స్వయంగా పాక్ ప్రధాని న‌వాజ్ ష‌రీఫ్ వెల్లడించ‌డం గ‌మ‌నార్హం. కేబినెట్‌ స‌మావేశంలో ప్రధాని బ్లాక్ డే అంశాన్ని ప్రతిపాదించ‌గా… కేబినెట్ దానికి ఆమోదం తెలిపింది.
భార‌త్… జమ్మూ అండ్‌ కాశ్మీర్‌లో అనాగ‌రికంగా, క్రూరంగా వ్యవ‌హ‌రిస్తోంద‌ని వ్యాఖ్యానించారు ష‌రీఫ్… బుర్హాన్‌ను స్వాతంత్రోద్యమంలో మ‌ర‌ణించిన వీరుడని అభిప్రాయపడ్డాడు. కాశ్మీర్‌ స్వాతంత్రోద్యమానికి పాక్‌ అండగా ఉంటుంది. ఆ ఉద్యమాన్ని అణ‌చివేయడం భారత సైన్యం వల్ల కాదన్నాడు షరీఫ్‌.
« PREV
NEXT »

No comments

Post a Comment