తాజా వార్తలు

Friday, 15 July 2016

సన్నీ సంచలనం..గత పదేళ్లలో రికార్డ్.!

సన్నీలియోన్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు..ఈ పేరు పిల్లాడి నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ భామ ఏ పని చేసినా అందులో వెరైటీని వెతుకుతారు జనాలు. అలా హాట్ హాట్‌‌గా కనిపిస్తూ నటించిన సినిమాలు కొన్నే అయినా భారీ సంఖ్యలోనే అభిమానులను సంపాదించుకుంది. అలా సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొద్దిరోజుల్లోనే అపారాభిమానాన్ని దక్కించుకుంది.
 
సన్నీ మరో రికార్డు సాధించింది. గత పదేళ్లలో ఎవరూ దక్కించుకోలేని రికార్డు సన్నీ సొంతం చేసుకుంది. ఎందుకు ఎలా అంటే గడిచిన పది సంవత్సరాల్లో మనదేశంలో ఎక్కువ మంది సెక్సీ సన్నీ గురించే గూగుల్‌‌లో సెర్చ్ చేశారు..ఇలా భారీ సంఖ్యలో వెతకడంతో హాట్ భామకు మొదటి స్థానం దక్కింది. ఈ విషయాన్ని గూగుల్ స్వతహాగా మీడియాకు ఫ్రెస్ రిలీజ్ రూపంలో తెలిపింది. దీంతో మరోసారి సన్నీ రికార్డు సృష్టించింది అని చెప్పుకోవచ్చు. ఈమె హాట్ వీడియోల కోసం తెగ ఎగబడి చూశారని టాక్ నడుస్తోంది.
 
ఇండియన్ సినీనటీ, నటీమణులు,సింగర్, డ్యాన్సర్, డైరక్టర్, సినిమాల కోసం గత పదేళ్లుగా నెటిజన్లు ఎవరెవరు ఏ యాక్టర్ కోసం వెతికారన్న విషయాలనూ గూగుల్ బయటపెట్టింది. ఇక సన్నీ తర్వాత కండల వీరుడు సల్మాన్ ఖాన్ రెండో స్థానంలో నిలిచాడు. హీరోల పరంగా చూస్తే సల్మాన్ మొదటి స్థానం, షారుక్ రెండో స్థానం, అక్షయ్ కుమార్ మూడో స్థానంలో, బిగ్ బీ అమితాబ్ నాల్గో స్థానంలో నిలిచారు. హీరోయిన్లలో సెక్సీ సన్నీ తరువాత కత్రినా, కరీనా కపూర్, దీపికా పదుకుణే, ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, తమన్నా బాటియా, అలియా భట్ ఉన్నారు. ఇక చివరగా సినిమాల విషయానికొస్తే పీకే, బాహుబలి టాప్‌‌‌లో ఉన్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment