తాజా వార్తలు

Sunday, 17 July 2016

ఖంగు తినిపించిన హృతిక్!

అసలు ఏం తింటాడు?... నలభై రెండేళ్ల వయసులోనూ ఆరు పలకల దేహంతో ఆరోగ్యవంతంగా ఉన్న హృతిక్ రోషన్‌ను చూడగానే అలా అడగాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అలాంటి హృతిక్ ‘నా ఫిట్నెస్ సీక్రెట్ ఈ ఫుడ్డే... తినండి’ అని అంటే ఎవరైనా వదులుతారా చెప్పండి! కానీ, పూజా హెగ్డే మాత్రం తినాలా? వద్దా? అని ఆలోచించారు. ఈ ఇద్దరూ ‘మోహంజొ దారో’లో జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ లొకేషన్లో హృతిక్ ఏవేవో ప్రాక్టికల్ జోక్స్ వేసి, పూజాని ఏడిపించేవారట. అందుకే ఆయన్ను పూజ నమ్మరు. ఆయనప్పటికీ ఓ విషయంలో హృతిక్ నమ్మించగలిగారు.

ఆ విషయంలోకి వస్తే... చాక్‌పీస్ ముక్కను పూజాకి చూపించి ప్రోటీన్‌బార్ అని నమ్మించేశారీ ఆరడుగుల అందగాడు. చాక్‌పీస్ చూసిన తర్వాత పూజాకి అనుమానం కలిగిందట. ‘ఇదేంటి ఇలా ఉంది’ అని అడిగారట కూడా. ‘ఆరోగ్యానికి మంచి చేసేవన్నీ ఆకర్షణీయంగా కనిపించవు. చేటు చేసేవన్నీ నోరూరించేలా అందంగా కనిపిస్తాయి. సాధారణంగా ప్రోటీన్ బార్స్ రుచికరంగా ఉండవు’ అని హృతిక్ నమ్మకంగా చెప్పారట. పాపం.. పూజా నమ్మేశారు. చివరకు, ఆ సుద్దముక్క తిని ఖంగు తినడం ఆమె వంతైంది. హృతిక్ మాటలు నమ్మి మోసపోయానని, ఏదేమైనా ఆయన అలా తమాషా చేయడం నచ్చిందనీ పూజ పేర్కొన్నారు.

« PREV
NEXT »

No comments

Post a Comment