తాజా వార్తలు

Tuesday, 12 July 2016

రవిబాబు నెక్స్ట్ మూవీ ’అదిగో’

రవిబాబు నటుడుగానే కాదు దర్శకుడిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు. ఎప్పటికప్పుడు వైవిధ్య కథలను తీస్తూ అందరినీ అలరించే రవిబాబు ఈ సారి మరో ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పంది మీద తెరకెక్కించిన సినిమాకు ‘అదుగో’ అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేశాడు ఈ హీరో కమ్ డైరక్టర్.
తనకు అచ్చొచ్చిన ‘అ’ అనే అక్షరంతోనే ఈ సినిమాకు టైటిల్‌ను పెట్టాలని నిర్ణయించుకొని, ’’అదుగో’’ అని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు రవిబాబు డైరక్షన్ వచ్చిన ‘అల్లరి’, ‘అవును’, ‘అనసూయ’ మంచి హిట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో హీరో హీరోయిన్లుగా అభిషేక్, నదా అనే కొత్త వాళ్లు నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. రవిబాబు ఏది చేసినా వెరైటీనే మరీ..
« PREV
NEXT »

No comments

Post a Comment