తాజా వార్తలు

Friday, 15 July 2016

ఎస్సీల వర్గీకరణ చేసిందే... టీడీపీ

గతంలో ఎస్సీల వర్గీకరణను చేసింది తెలుగు దేశం పార్టీనే అని, సుప్రీం కోర్టు తీర్పుతో దానిని పక్కన పెట్టాల్సి వచ్చిందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈనెల 19 నుంచి వచ్చే నెల 12 వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేయనున్న దీక్షకు ఆయన మద్దతు కోరినట్లు రేవంత్ చెప్పారు. ఎన్టీఆర్ భవన్లో గురువారం మంద కృష్ణ టీటీడీపీ నేతలు రేవంత్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులతో భేటీ అయ్యారు.

అనంతరం రేవంత్, మందకృష్ణ మీడియాతో మాట్లాడారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో, పొలిట్‌బ్యూరోలో చర్చించి మాదిగలకు న్యాయం చేస్తామన్నారు. ఢిల్లీలో తలపెట్టిన దీక్షకు అఖిలపక్షంతో కలసి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు రావాలని మంద కృష్ణ కోరారు.
« PREV
NEXT »

No comments

Post a Comment