తాజా వార్తలు

Sunday, 24 July 2016

ఈ ‘హిజ్రా’ గురించి తెలిస్తే కన్నీరు ఆగదు..

హిజ్రాలు ట్రైన్‌‌లలో, వీధుల్లో, షాపుల దగ్గరికి వచ్చి డబ్బులు ఇవ్వాలని తెగ డిమాండ్ చేస్తారు.. డబ్బులు ఇస్తే సరే లేకుంటే ఇచ్చేంత వరకు పీడిస్తుంటారు. వీరిలో మంచోళ్లు కూడా ఉంటార్లేండి కాదనట్లేదు. హిజ్రాలకు ఎంత స్వతంత్రం వచ్చినా వారిని మాత్రం సమాజం చిన్న చూపే చూస్తోందన్నది వాస్తవం. ఇప్పుడు మీకు చెప్పబోయే అహ్మదాబాద్ హిజ్రా కథ వింటే ఆశ్చర్యపోతారు.
 
అందరిలాగే పెరిగాడు.. చదువుకున్నాడు 20 సంవత్సరాలు దాటిన తరువాత కూడా తన శరీరంలో మార్పులేమీ రాకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచలేదు. తల్లిదండ్రులకు, స్నేహితులకు విషయం చెప్పలేక.. మనసులో పెట్టుకోలేక కుమిలిపోయిన ఓ యువకుడు ధైర్యం తెచ్చుకుని వైద్యుడిని సంప్రదించాడు. ఇంతలో డాక్టర్ నుంచి ఊహించని సమాధానం వచ్చింది. యువకుడిలో మగాడి లక్షణాల్లేవ్ హిజ్రా లక్షణాలే ఉన్నట్లు వైద్య పరీక్షలో వెల్లడైంది. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే ఏమవుతుందో అని బయపడి అప్పటికీ చెప్పలేదు. ఆఖరికి తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు. తీవ్ర ఒత్తిడితో 22 సంవత్సరాలకే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లయిన కొన్నాళ్లకు లైంగికంగా సంతృప్తిపరిచే సామర్థం తనలో లేదని తల్లిదండ్రులకు, భార్యకు విషయం చెప్పాడు. అంతే ఈ నోటా ఆ నోటా పడి జనాలకు తెలిసే సరికి వెలివేసే పనయ్యింది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో వేరే పెళ్లి చేసుకుని హాయిగా ఉండు అని భార్యకు చెప్పి ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. అప్పుడే ఎనలేని కష్టాలు మొదలయ్యాయి. తినడానికి తిండి లేదు.. గూడు లేదు అలా కొన్ని రోజులు గడిపాడు. చివరికి తనలాంటి మరికొందరిని కలిసి గెటప్ మార్చేసి పెళ్లిల్లకు, ఫంక్షన్లకు వెళ్లి డ్యాన్స్ వేస్తూ నాలుగు రాళ్లు సంపాదించడం మొదలెట్టాడు.
 
రోజు మాదిరిగా ఓ ఫంక్షన్‌‌కు వెళ్లాడు.. కానీ అక్కడ ధీన స్థితిలో ఉన్న భార్య ఓ చిన్నపిల్లాడితో ఎదురైంది. కన్నీరుమున్నీరైన అతను వివరాలు అడిగి తెలుసుకున్నాడు. మీరు చెప్పినట్లే వేరే పెళ్లి చేసుకున్నాను.. రోజు నన్ను శారీరకంగా, మానసికంగా హింసిస్తుండేవాడు. డబ్బులంతా మద్యం తాగడానికే ఖర్చుపెట్టేవాడని తనలోని బాధను మొత్తం మొదటి భర్తకు(హిజ్రా) చెప్పేసింది. ఆఖరికి వారిద్దరికి విడాకులు ఇప్పించి ఆమె కుమారుడికి తండ్రి బాధ్యతలను తనే (హిజ్రా) తీసుకున్నాడు. అంతేకాదు అన్నీ తానై చూసుకుని కుమారుడికి వివాహం ఘనంగా జరిపించాడు. మొత్తానికి సమాజం, తల్లిదండ్రులు అందరూ వెలివేసినా బాధ్యతలు మాత్రం తెలుసని నిరూపించుకున్నాడు. ఈ విషయం సోషల్ మాధ్యమాల్లో, టీవీల్లో ప్రసారం అవ్వడంతో సాటి హిజ్రాలు ఆనందం వ్యక్తం చేశారు. శభాష్ అంటూ మెచ్చుకున్నారు. రియల్ పేరెంట్ అంటే నువ్వే అంటూ ప్రశంసలు కురిపించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment