తాజా వార్తలు

Saturday, 2 July 2016

రాష్ట్ర ప్రయోజనాలు విదేశాలకు తాకట్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశాలకు తాకట్టు పెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ ధ్వజమెత్తారు. రాజధానిని సింగపూర్‌కు తాకట్టు పెట్టింది చాలక, తీర ప్రాంతాన్ని చైనాకు తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఏపీ సముద్ర తీరంలో ఎక్కడ కావాలంటే అక్కడ పోర్టు నిర్మించుకోడానికి స్థలం ఇస్తామని చైనా పర్యటనలో సీఎం చంద్రబాబు చెప్పడం దేశ, రాష్ట్ర ప్రయోజనాలతో చెలగాటం ఆడటమేనని మండిపడ్డారు. డబ్బులొస్తే చాలు తీర ప్రాంతాన్ని విదేశాలకు అప్పగించేస్తారా? ఇది అంతర్గత భద్రతకు సంబంధించిన విషయం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని వనరులను, సహజ సంపదనూ విదేశీయులకు తాకట్టు పెట్టడం చంద్రబాబుకు తొలి నుంచీ అల వాటేనని దుయ్యబట్టారు.
« PREV
NEXT »

No comments

Post a Comment